మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్ గా శ్రద్ధ.. అవార్డ్ అందజేసిన ప్రధాని మోదీ

-

దేశంలోని పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ 2024 పేరుతో పురస్కారాలు అందజేశారు. దిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్రియేటర్స్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పురస్కారాలు ప్రదానం చేశారు. మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్గా శ్రద్ధ నిలిచారు. గ్రీన్ ఛాంపియన్ విభాగంలో పంక్తి పాండే, స్టోరీ టెల్లర్గా కీర్తికా గోవిందసామి, కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గాయని మైథిలీ ఠాకూర్, టెక్ కేటగిరీలో ఉత్తమ సృష్టికర్తగా గౌరవ్ చౌదరీ ఈ పురస్కారాన్ని గెలుచుకున్నారు.

20 విభాగాల్లో మొత్తం 23 మంది విజేతలకు ఈ అవార్డులను ఇచ్చారు. ఈ అవార్డుల కోసం 20 విభాగాల్లో సుమారు 1.5 లక్షలపైగా నామినేషన్లు రాగా విజేతల కోసం ఓటింగ్ను నిర్వహించారు. అందులో 10 లక్షల మంది ఓట్లు వేశారు. విజేతలుగా అంతర్జాతీయ క్రియేటర్లు సహా 23 మంది నిలిచారు. సృజనాత్మకత ఆలోచనలను తీసుకొస్తున్న ఇన్ప్లూయెన్సర్లుకు, క్రియేటర్లను గుర్తించేందుకు ప్రభుత్వం మొట్టమొదటి సారిగా నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ను ఈ సంవత్సరం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version