రేవంత్ చెవిలో చంద్ర‌బాబు ఏం చెప్పారు.. వైర‌ల్‌గా మారిన ఇరువురి నేత‌ల గుస‌గుస‌లు

-

అధికారంలోకి రావ‌డం కోసం ఎన్ని అడ్డ‌దారులున్నాయో అన్నింటినీ వినియోగించుకోవ‌డానికి చంద్ర‌బాబునాయుడు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.ఓవైపు బీజేపీతో పొత్తుకోసం వెంప‌ర్లాడుతూనే మ‌రోవైపు కాంగ్రెస్‌తో క‌ర‌చాల‌నం చేయ‌డం అత‌నికే చెల్లింది.గ‌తంలో ఇలా అనేక‌సార్లు సానుభూతి కోసం ప్ర‌య‌త్నాలు చేశారు చంద్ర‌బాబు.గాజాగా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం ప్ర‌జ‌ల కంట ప‌డింది.పొత్తుల‌పై కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తాపార్టీ అగ్ర‌నేత‌ల‌ను క‌ల‌వ‌డానికి వెళ్తున్న చంద్ర‌బాబునాయుడు తెలంగాణ‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రిని క‌ల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.ఈ స‌న్నివేశంపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

లోక్‌స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఏపీలో కూట‌మిగా అవ‌త‌రించాయి తెలుగుదేశం,జ‌న‌సేన పార్టీలు.కేంద్రంలోని బీజేపీ పొత్తు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు ఈ ఇరుపార్టీల నేత‌లు. ఇటీవ‌ల భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి వ‌చ్చారు చంద్ర‌బాబునాయుడు.పొత్తుపై క్లారిటీ రాక‌పోవ‌డంతో గురువారం మ‌ళ్ళీ ఢిల్లీ వెళ్ళారు చంద్ర‌బాబు. ఈ క్ర‌మంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో త‌న శిష్యుడు,సీఎం రేవంత్‌రెడ్డితో చెవిలో గుస‌గుస‌లాడారు చంద్ర‌బాబు.గ‌తంలో కూడా ఇలాగే ఎయిర్‌పోర్ట్‌లో క‌ర్నాట‌క డిప్యూటీ సీఎం డికే శివ‌కుమార్‌తో కూడా వ్య‌వ‌హ‌రించారు.ఇప్పుడు మ‌రోసారి కాంగ్రెస్ నేత‌తో మాట్లాడ‌టం ప‌ట్ల చంద్ర‌బాబుపై ప‌లువిధాలుగా సోష‌ల్ మీడియాలో సైటెర్లు పేలుతున్నాయి.రెండు క‌ళ్ళ సిద్ధాంతానికి సింబ‌ల్ అయిన చంద్ర‌బాబుకి మాత్ర‌మే ఇలాంటివి సాధ్య‌ప‌డ‌తాయంటూ నెటిజ‌న్‌లు కామెంట్లు చేస్తున్నారు.

తాజా ప‌రిణామంపై నెటిజ‌న్‌లు స్పందిస్తూ బహుశా దేశంలో ఇలాంటి వ్య‌క్తి ఉందడేమో అని ఎద్దేవా చేస్తున్నారు.ఓవైపు బీజేపీతో పొత్తు మ‌రోవైపు కాంగ్రెస్ నాయ‌కుల‌తో మంత‌నాలు జ‌ర‌ప‌డం అత‌నికే చెల్లిందంటూ వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు.ఏపీలో ఎన్నికల సందర్భంగా తెలంగాణ బోర్డర్ లో డబ్బు ట్రాన్స్ఫర్ కోసం.. సీఎం రేవంత్ తో చంద్రబాబు మంతనాలు చేశారంటూ మ‌రికొంత మంది అంటున్నారు.మొత్తానికి ఎన్నిక‌ల వేళ చంద్ర‌బాబునాయుడు ఇలా ఏదో ఒక విధంగా చ‌ర్చ‌ల్లో నిలుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version