ప్రపంచమంతా కరోనా మహమ్మారి దెబ్బకి వణికిపోతుంది. భారత్ లో కూడా ఇదే పరిస్థితి. రోజురోజుకు నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తుంటే భయమేస్తుంది. దీంతో రంగంలోకి దిగిన శాస్త్రవేత్తలు దీనికి వాక్సిన్ కనిపెట్టే పనిలో పడ్డారు. నిద్రాహారాలు మానేసి కఠోర దీక్ష చేస్తున్నారు. అయితే ఈ మహమ్మారిపై మన దేశంలోని కొందరు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే.. హాస్యాస్పదంగా ఉన్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారిని చాలా తేలికగా తీసుకుంటున్నారు, అంతే కాకుండా దీనికి విరుగుడు కూడా వాళ్ళే చెప్పేస్తున్నారు.
తాజాగా.. మీకు కరోనా సోకిందటగా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మధ్యప్రదేశ్ మంత్రి ఇమార్తి దేవి గ్వాలియర్లో వింత సమాధానం ఇచ్చారు. నేను మట్టి, ఆవు పేడలో జన్మించాను. అక్కడ చాలా సూక్ష్మక్రిములున్నాయి. కరోనా నా దగ్గరికి కూడా రాదని తెలిపింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవగా.. నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు.
मैं गोबर में पैदा हुई हूं इतने कर्रे कीटाणु है कि #कोरोना नहीं आएगा – #मंत्री_इमरती_देवी
ठीक है मान ली आपकी बात 🙏 #imartidevi #MadhyaPradesh #ShivrajSinghChauhan pic.twitter.com/AaK3ZcJ4pr— Kumar kundan ostwal (@OstwalKumarp) September 4, 2020