శ్రీలంక టూర్‌కు టీమ్‌ ఇండియా.. ఆ ఇద్దరిని పక్కన పెట్టడంపై శశిథరూర్ ఫైర్

-

భారత్‌, శ్రీలంక మధ్య జులై 27 నుంచి మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ సిరీస్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. కొత్త ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, చీఫ్ సెలక్టర్‌ అజిత్ అగార్కర్ జట్టును అనౌన్స్ చేశారు. ఈసారి జట్టులో ఎక్కువగా యంగ్ ప్లేయర్స్కు అవకాశం కల్పించారు. వన్డే సిరీస్‌కు సంజూ శాంసన్‌, టీ20లకు అభిషేక్ శర్మను ఎంపిక చేయలేదు. దీంతో సెలక్షన్ కమిటీపై కాంగ్రెస్‌కు చెందిన తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజకీయాలతోపాటు క్రికెట్‌ సంబంధిత విషయాలపైనా శశిథరూర్‌ స్పందిస్తారనే విషయం తెలిసిందే. ఇప్పుడు జట్ల సెలక్షన్‌పై సోషల్ మీడియాలో ఆయన పోస్టు పెట్టారు. ‘‘ఈ నెలలో భారత్‌ శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. అందుకోసం ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసింది. గత వన్డేలో సెంచరీ సాధించిన ఓ బ్యాటర్‌కు ఈసారి అవకాశం దక్కలేదు. జింబాబ్వేతో సిరీస్‌లో రికార్డు సెంచరీ చేసిన అభిషేక్‌ నాయర్‌ను టీ20లకు పక్కన పెట్టారు. ఇలాంటి అద్భుతాలు చేసేవారి ప్రదర్శన సెలక్టర్లకు చాలా చిన్న విషయంగా అనిపించొచ్చు. శ్రీలంక పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లకు శుభాకాంక్షలు. మన జట్టుకు ఆల్‌ ది బెస్ట్’’ అని శశి థరూర్ పోస్టులో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version