IND W vs PAK W: మహిళల ఆసియా కప్-2024 లో భాగంగా ఇవాళ భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానల్ తో పాటు హాట్ స్టార్ లో వీక్షించవచ్చు. అంతర్జాతీయ మహిళల టీ20ల్లో IND, PAK ఇప్పటివరకు 14 మ్యాచుల్లో తలపడగా భారత్ 11, పాక్ మూడు విజయాలు సాధించాయి. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు 8 ఎడిషన్లు జరగగా, IND 7 సార్లు ఛాంపియన్ గా నిలిచింది.
భారత మహిళల (IND-W) ప్రాబబుల్ XI జట్టు
షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), సజీవన్ సజన, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, ఉమా చెత్రీ (wk), పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి
పాకిస్తాన్ మహిళల (PAK-W) ప్రాబబుల్ XI జట్టు
సిద్రా అమీన్, ఒమైమా సోహైల్, ఇరామ్ జావేద్, నిదా దార్ (c), అలియా రియాజ్, ఫాతిమా సనా, గుల్ ఫిరోజా, మునీబా అలీ (WK), డయానా బేగ్, సాదియా ఇక్బాల్, నష్రా సంధు