బంగ్లాదేశ్ లో హిందువులు సేఫ్.. మోదీకి యూనస్​ఖాన్​ భరోసా

-

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ తన ప్రసంగంలో బంగ్లాదేశ్ లో హిందువుల రక్షణ గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ లో హిందువులు, మైనారిటీల పరిస్థితిపై 140 కోట్ల భారతీయులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. అయితే దీనిపై ఆ దేశ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ ఖాన్ స్పందించారు. ప్రధాని మోదీకి ఆయన ఫోన్ చేసి మైనారిటీల రక్షణపై భరోసానిచ్చినట్లు మోదీ స్వయంగా ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్​ యూనస్‌ఖాన్‌ హామీ ఇచ్చినట్లు మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. ప్రొఫెసర్‌ యూనస్‌ తనకు ఫోన్‌ చేసి మాట్లాడినట్లు పేర్కొన్న మోదీ.. ప్రజాస్వామ్య, సుస్థిర, శాంతియుత, ప్రగతిశీల బంగ్లాదేశ్‌ కోసం భారత దేశ మద్దతు కొనసాగుతుందని యూనస్‌కు స్పష్టం చేసినట్లు తెలిపారు.

మరోవైపు రిజర్వేషన్ల కోసం చెలరేగిన ఆందోళన అల్లర్లకు దారి తీయడంతో చివరకు దేశ ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసి దేశాన్ని విడిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version