Mumbai: ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాదచారుల పైకి దూసుకెళ్లింది బస్సు. ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. ముంబై-కుర్లా వెస్ట్‌లో పాదచారుల పైకి దూసుకెళ్లింది ఓ బస్సు. ఈ సంఘటన లో ముగ్గురు మృతి చెందగా.. 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ గా మారింది.
మహారాష్ట్ర పోలీసు అధికారి ప్రకారం… రూట్ నంబర్ 332లోని బస్సు డ్రైవర్ బ్రేక్‌పై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు… పాదచారులతో పాటు కొన్ని వాహనాలపైకి దూసుకెళ్లింది. బెస్ట్ అండర్‌టేకింగ్‌కు చెందిన బస్సు రెసిడెన్షియల్ సొసైటీ గేట్‌లను ఢీకొని ఆగిపోయిందని ఆయన చెప్పారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, కొంత మంది గాయపడ్డారని, వారు సమీపంలోని భాభా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారి తెలిపారు. బస్సు కుర్లా రైల్వే స్టేషన్ నుంచి అంధేరికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు ఆయన తెలిపారు.