Mumbai Rains: ముంబై మహా నగరంలో హై టెన్షన్ నెలకొంది. ఇవాళ ముంబైలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. నిన్నటి నుంచి ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. సెప్టెంబర్ 26 అంటే ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ముంబైకి రెడ్ అలర్ట్ ప్రకటించింది. బుధవారం భారీ వర్షం ముంబైని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. లోకల్ రైళ్లు వాటి ట్రాక్‌లలో నిలిచిపోయాయి.
కనీసం 14 ఇన్‌కమింగ్ విమానాలను మళ్లించవలసి వచ్చింది. భారీ వర్షాల హెచ్చరికల మధ్య, బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) కూడా నగరంలోని అన్ని పాఠశాలలు మరియు కళాశాలలను ఈ రోజు (సెప్టెంబర్ 26) మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అవసరమైతే మాత్రమే పౌరులు తమ ఇళ్ల నుంచి బయటకు రావాలని పౌరసమితి కోరింది. సబర్బన్ రైళ్ల నిలిపి వేశారు. పలు విమానాల దారి మళ్లింపు కూడా జరిగింది. పూణెలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.