భారత సంతతికి చెందిన సింగపూర మాజీ మంత్రి ఎస్. ఈశ్వరన్ (61)పై తాాజాగా కొత్తగా ఎనిమిది అవినీతి ఆరోపణలు దాఖలు అయ్యాయి. జనవరిలో మోపిన 27 అభియోగాలతో కలుపుకొని మొత్తం 35 ఆరోపణలను ఈశ్వరన్ ఎదుర్కొంటున్నారు. కోర్టు అనుమతితో ఆస్ట్రేలియాకు వెళ్లివచ్చిన వారం రోజులకే ఈశ్వరన్ పై కొత్త ఆరోపణలు దాఖలయ్యాయి.
లుమ్ కోక్ సంగ్ అనే బిల్డర్ ను ఖరీదైన విస్కీ సీసాలు, గోల్ఫ్ సాధనాలు, సైకిల్ను లంచంగా తీసుకున్నట్లు ఈశ్వరన్పై తాజా ఆరోపణలు వచ్చాయి. ఆయన గతంలో అంగ్ బెంగ్ సెంగ్ అనే మరో బిల్డర్ నుంచి ఖరీదైన బహుమతులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలన్నింటిలో తాను నిర్దోషిని అని ఈశ్వరన్ వాదిస్తున్నారు.