ఉద్యోగులపై ప్రతిపక్షాలు అభాండాలు : ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి

-

ఏపీలో ఉద్యోగులపై ప్రతిపక్షాలు అభాండాలు వేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ చట్టాలను నిర్వర్తించడమే ఉద్యోగస్తుల బాధ్యత అన్నారు. రాష్ట్రాన్ని బాగు చేసేందుకే వాలంటీర్, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థలకు జాతీయ స్థాయిలో మంచిపేరు వచ్చింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే వాలంటీర్ వ్యవస్థను విమర్శిస్తున్నారు.

కరోనా సమయంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పనిచేశారు. లోకేష్ పోలీసులను బెదిరిస్తున్నారు
పార్టీలు వస్తూ పోతూ ఉంటాయి.. ఉద్యోగులే పర్మినెంట్ ఎన్నో పార్టీలను చూశాంజజ కానీ టీడీపీ మాదిరిగా ఎవరూ ఉద్యోగులను బెదిరించలేదు. లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులకు ఎవరూ భయపడరు అన్నారు.
ఉద్యోగులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. కరోనా  వల్ల కొన్ని ఆర్థిక సమస్యలు వచ్చాయి. ఎన్ని సమస్యలు ఉన్నా ఇటీవలే రెండు డీఏ ఇచ్చారు. ఉద్యోగులు ఏది అడిగినా చేయాలనే తాపత్రయం సీఎం జగన్ ఆర్థిక సమస్యలతోనే కొన్ని చేయలేకపోతున్నారు.  దశలవారీగా ఉద్యోగస్తులను రెగ్యులర్ చేస్తున్నాం అని తెలిపారు. ఉద్యోగస్తులంతా పోస్టల్ బ్యాలెట్ ని తప్పకుండా ఉపయోగించుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version