New UPI Transaction Limits From November 1: UPI సేవలు వినియోగించుకునే వారికి బిగ్ అలర్ట్. ఇవాళ్టి నుంచి రూల్స్ మారిబోతున్నాయి. నవంబర్ 1వ తేదీ అంటే నేటి నుంచి UPI చెల్లింపుల నియామకాలను మార్చనున్నారు.
ఈ షరతులు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి ఫ్లాట్ ఫారమ్ లను వినియోగించే వినియోగదారులపై ప్రభావాన్ని చూపనున్నాయి. ఇప్పుడు థర్డ్ – పార్టీ యాప్ లలో యూపీఐ లావాదేవీల సంఖ్యను పరిమితం చేయనున్నారు. దీంతో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, లావాదేవీల వ్యవస్థపైన ఒత్తిడి తగ్గించే యోచనలో యూపీఐ సంస్థ ఉంది. దీనివల్ల వినియోగదారులు ప్రయోజనాన్ని పొందనున్నారు. అయితే.. థర్డ్ – పార్టీ యాప్ లలో యూపీఐ లావాదేవీల సంఖ్యను పరిమితం చేయడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.