బీహార్ లో అధికార జెడియు, బిజెపి సంకీర్ణ ప్రభుత్వానికి బీటలు వారే సూచనలు కనిపిస్తున్నాయి. కమలదలంతో సీఎం నితీష్ కుమార్ ఏ క్షణంలోనైనా తెగదెంపులు చేసుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. జెడియు మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి ఆర్సిపి సింగ్ సొంత పార్టీతో కంటే బిజెపితో సత్సంబంధాలు నేరపడమ్, ఆయన్ని నితీష్ టార్గెట్ చేయడం.. అనంతరం సింగ్ రాజీనామాతో బీహార్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
బీహార్లో సీఎం నితీష్ కుమార్ జేడీయు పార్టీని బిజెపి చీల్చేందుకు ప్రయత్నిస్తుందంటూ జిడియు అభద్రతాభావానికి గురవుతోంది. దీంతో బీజేపీతో జిడియు తెగదెంపులు చేసుకోవడానికి నితీష్ కుమార్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు.ఐతే నితీష్ కుమార్ కొద్దిసేపట్లో తన రాజీనామాను గవర్నర్ కి సమర్పిస్తారు అన్నట్లు తెలుస్తోంది. అయితే నితీష్ కుమార్ “కాసేపట్లో అదిరిపోయే వార్త చెబుతా”.. అనడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆర్జెడి, కాంగ్రెస్ తో కలిసి నితీష్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.