తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై రాజ్యసభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉందని గుర్తు చేశారు. విభజన తరువాత తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపడం లేదన్నారు. తాను ఏ పార్టీని తప్పు పట్టడం లేదని తెలిపారు. ఇందిరాగాంధీ విజయం సాధించిన మెదక్ లో తొలుత రైల్వే స్టేషన్ మోడీ ఏర్పాటు చేశారు.

రామగుండం ఎరువు ఫ్యాక్టరీని పునరుద్ధరించామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం లోక్ సభ ముందుకు ఆదాయపు పన్ను కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సభను స్పీకర్ వచ్చే నెల 10 వరకు వాయిదా వేశారు. మరోవైపు కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. మోజువాణి ఓటు ద్వారా బిల్లు తీర్మాణాన్ని ఆమోదించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version