సినిమా థియేటర్లలో పిల్లల ప్రవేశం.. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్

-

సినిమా థియేటర్లలోకి పిల్లల ప్రవేశం పై తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. మల్టీప్లెక్స్ యాజమాన్యాల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. పదహారేళ్లలోపు పిల్లల్ని రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటలలోపు థియేటర్లలోకి అనుమతించవద్దని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. దీనిపై అన్ని వర్గాలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ మల్టీప్లెక్స్ యాజమాన్యాల సంఘం అప్పీలు దాఖలు చేసింది. ఈ నిర్ణయం వల్ల మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యం తీవ్రంగా నష్టపోతుందని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సింగిల్ బెంచ్ వద్ద పిటిషన్ పెండింగ్ లో ఉండగా.. అప్పీలు పై జోక్యం చేసుకోలేమని సీజే ధర్మాసనం స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ వద్ద ఉన్న పెండింగ్ పిటిషన్ లో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. దీనికి పిటిషనర్లు అంగీకరించడంతో అప్పీల్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version