మహిళల కోసం రిలయన్స్‌ ఫౌండేషన్‌.. హర్‌ సర్కిల్‌ పేరిట డిజిటల్‌ ఫ్లాట్‌ఫాం..

-

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రిలయన్స్ ఫౌండేషన్‌ చైర్‌ పర్సన్ నీతా అంబానీ మహిళల కోసం హర్‌ సర్కిల్‌ (Her Circle) పేరిట ఓ నూతన డిజిటల్‌ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించారు. కేవలం మహిళల కోసమే దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆమె వివరించారు. ప్రపంచంలో ఉన్న మహిళలందరూ ఈ వేదికలో భాగస్వామ్యం కావచ్చని, వారు తమ తమ సక్సెస్‌ స్టోరీలను ఇందులో షేర్‌ చేయవచ్చని, దీంతో ఇతర మహిళలకు ఆదర్శంగా నిలవచ్చని అన్నారు.

హర్‌ సర్కిల్‌లో మహిళలకు ఉపయోగపడే విధంగా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుందన్నారు. మహిళలు ఇందులో తమకు వచ్చే ఆలోచనలను పాలు పంచుకోవచ్చని, వినూత్న ఐడియాలను తెలియజేయవచ్చని.. అలాంటి వారికి రిలయన్స్‌ ఫౌండేషన్‌ సహాయాన్ని అందజేస్తుందని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ఎదగడంతోపాటు ఆర్థిక స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. సమాజంలోని ఒక మహిళ మరొక మహిళకు అండగా నిలవాలని, ఒకరు మరొకరికి ప్రేరణగా ఉండాలని, ఒకరికొకరు సహాయం చేసుకోవాలనే ఉద్దేశంతో హర్‌ సర్కిల్‌ను ప్రారంభించడం జరిగిందన్నారు.

హర్‌ సర్కిల్‌లో కేవలం మహిళలు మాత్రమే ఉంటారన్నారు. వారికి ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు నిపుణులు సిద్ధంగా ఉంటారని తెలిపారు. అలాగే మహిళల ఆరోగ్యం కోసం ఇందులో ప్రత్యేక టూల్స్‌ను అందిస్తున్నట్లు తెలిపారు.

కాగా హర్‌ సర్కిల్‌ ప్రస్తుతం ఇంగ్లిష్‌ భాషలోనే అందుబాటులో ఉంది. త్వరలోనే దీన్ని ఇతర భారతీయ భాషల్లోనూ అందుబాటులోకి తేనున్నారు. హర్‌ సర్కిల్‌ (https://hercircle.in/) వెబ్‌ ప్లాట్‌ఫాంతోపాటు యాప్‌ రూపంలోనూ అందుబాటులో ఉంది. దీనికి చెందిన యాప్ గూగుల్‌ ప్లే స్టోర్‌, మై జియో స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లలో అందుబాటులో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version