ఒడిశా నెక్స్ట్ సీఎం ఎవరు?.. ఇంకా వీడని సస్పెన్స్

-

ఒడిశా కొత్త ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం పీఠం ఎక్కేది ఎవరో తేలకపోవడంతో ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని జూన్ 12వ తేదీకి వాయిదా వేశారు. తొలుత జూన్ 10న ఒడిశాలో బీజేపీ ప్రభత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినా నరేంద్ర మోదీ బిజీగా ఉండటంతో ఒడిశాలో ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేసినట్లు బీజేపీ నేతలు తెలిపారు.

25 ఏళ్ల తర్వాత ఒడిశాకు కొత్త వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, మాజీమంత్రి జోయల్‌ ఓరం, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు భైజయంత్‌ పండా, భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి, బాలేశ్వర్ ఎంపీ ప్రతాప్ సారంగి, కాగ్ గిరీశ్ చంద్ర ముఖ్యమంత్రి రేసులో ముందున్నారు. ఒడిశా సీఎంగా బీజేపీ కొత్తవారిని పరిచయం చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై క్లారిటీ రానున్నట్లు టాక్.

Read more RELATED
Recommended to you

Exit mobile version