మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. పోలీసు బలగాల్లో మహిళా సిబ్బంది సంఖ్య 33 శాతానికి పెంపు..

-

మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం కీల‌క‌మైన‌ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పోలీసు దళాలలో మహిళా సిబ్బంది సంఖ్య‌ను 33 శాతానికి పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది ఫిల్హర్‌లో 10.30 శాతం ఉండ‌గా, సాయుధ పోలీసులతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం పోలీసు శాఖలో 26,23,225 మంది ఉండగా అందులో 5,31,737 ఖాళీలు ఉన్నాయని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఆగస్టు 10 న లోక్‌సభలో తెలియజేశారు.

బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (BPR & D) విడుదల చేసిన జనవరి 1, 2020 నాటి పోలీసు సంస్థల తాజా డేటా ప్రకారం ఇది ఆందోళన కలిగించే విషయం. కాగా మహిళా పోలీసుల సంఖ్య ఇంకా తక్కువగా ఉందని BPR & D ఇప్పటికే సూచించింది. BPR & D నివేదిక పోలీసు శాఖలో మహిళల సంఖ్య తక్కువగా ఉన్నందున, మహిళా నేరస్థుల నేరాలను ఎదుర్కోవడంలో తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. అందువల్ల మహిళా పోలీసు సిబ్బంది సంఖ్యను పెంచడం అవసరం అని అభిప్రాయ‌ప‌డింది.

ఓ సీనియర్ హోం మంత్రిత్వ శాఖ అధికారి.. పోలీసు దళాలలో తక్కువ సంఖ్యలో మహిళా పోలీసు సిబ్బంది గురించి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ లిస్ట్- II (స్టేట్ లిస్ట్), లింగ సమతుల్యతలో పోలీసులు ఒక రాష్ట్ర సబ్జెక్ట్ అని చెప్పారు. సంస్కరణలతో సహా మరింత మంది మహిళా పోలీసు సిబ్బందిని నియమించడం ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని, పోలీసు బలగాలలో మహిళా సిబ్బంది సంఖ్యను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు సలహాలు జారీ చేస్తుందని ఆయన అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో కనీసం ముగ్గురు మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్లు, 10 మంది మహిళా పోలీసు కానిస్టేబుళ్లు ఉండాలని, తద్వారా మహిళా హెల్ప్ డెస్క్‌ని 24 గంటలూ ఏర్పాటు చేయవచ్చని సలహా ఇచ్చారు.

తక్కువ సంఖ్యలో మహిళా పోలీసు సిబ్బందిపై జమ్మూ కాశ్మీర్ మాజీ డిజిపి అశోక్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బు కొరత ఉందని, ఈ కారణంగా వారు ఖాళీగా ఉన్న‌ మహిళా సిబ్బంది పోస్టుల్లో మ‌హిళ‌ల‌ను నియమించడం లేదని అన్నారు. మెట్రో లేదా పెద్ద నగరాలు, చిన్న పట్టణాలు లేదా గ్రామీణ పోలీస్ స్టేషన్లలో మహిళా పోలీసు సిబ్బంది కోసం ప్రత్యేక టాయిలెట్ సౌకర్యాలు కనిపించడం లేదని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version