దేశంలో 492కు చేరిన ఓమిక్రాన్.. కొత్త‌గా 70 కేసులు

-

ఓమిక్రాన్ వేరియంట్ దేశంలో వేగంగా విస్త‌రిస్తుంది. ఆదివారం దేశ వ్యాప్తంగా 70 ఓమిక్రాన్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ఓమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 492కు చేరింది. అలాగే ఆదివారం కొత్త‌గా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో కూడా ఒక‌ ఓమిక్రాన్ వేరియంట్ కేసు వెలుగు చూసింది. దీంతో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు వ‌చ్చిన రాష్ట్రాల సంఖ్య 19కి చేరింది. కాగ‌ కేర‌ళలో ఆదివారం కొత్తగా 19 ఓమిక్రాన్ కేసులు న‌మోదు అయ్యాయి. వీటితో రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 57 కు చేరింది.

అలాగే మ‌హారాష్ట్రలో కూడా ఆదివారం 31 ఓమిక్రాన్ కేసులు కొత్త‌గా న‌మోదు అయ్యాయి. దీంతో మ‌హారాష్ట్రలో ఇప్ప‌టి వ‌ర‌కు నమోదు అయిన కేసుల సంఖ్య 141కి చేరింది. మ‌ధ్య ప్ర‌దేశ్ లో కూడా 6 కేసులు న‌మోదు అయ్యాయి. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఆదివారం 2 ఓమిక్రాన్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో ఏపీలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 6 కు చేరింది. తెలంగాణ‌లో మూడు ఓమిక్రాన్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో తెలంగాణ‌లో ఇప్ప‌టివ‌ర‌కు 44 కేసులు న‌మోదు అయ్యాయి. అలాగే హార్యాన లో ఒక‌టి, ఒడిశా లో 4, చండీగ‌ఢ్ లో 2 చొప్పున ఓమిక్రాన్ కేసులు న‌మోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version