అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే

-

అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ వేడుకకు హాజరయ్యేందుకు దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, సినీతారలు, క్రీడాకారులు, సాధువులు ఒక్కొక్కొరుగా రామజన్మ స్థలానికి చేరుకున్నారు. మరోవైపు చిత్రపరిశ్రమ నుంచి కొంతమంది నటులు, దర్శకులు సహా అయోధ్యకు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 10:45 గంటలకు అయోధ్యకు రానున్నారు.

అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రానున్న ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే 

  • ఉదయం 10.25 గంటలకు అయోధ్య విమానాశ్రయానికి ప్రధాని
  • 10.45 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకోనున్న ప్రధాని
  • 10.55 గంటలకు శ్రీరామ జన్మభూమికి చేరుకోనున్న ప్రధాని
  • 11 గంటల నుంచి మ.12 గంటల వరకు రిజర్వ్
  • మధ్యాహ్నం 12.05 నుంచి 12.55 గంటల వరకు ప్రాణప్రతిష్ఠలో పాల్గొననున్న ప్రధాని
  • 12:55 గంటలకు ప్రార్థనా స్థలం నుంచి బయలుదేరనున్న ప్రధాని
  • ఒంటి గంటకు పబ్లిక్ ఫంక్షన్ వేదికకు ప్రధానమంత్రి
  • 1 నుంచి 2గంటల వరకు ప్రజా కార్యక్రమాలకు ప్రధాని
  • అయోధ్యలో జరిగే బహిరంగ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని
  • 2.10 గంటలకు కుబేర్ తిలాను సందర్శించనున్న ప్రధాని మోదీ

Read more RELATED
Recommended to you

Exit mobile version