2047 నాటికి వికసిత్‌ భారత్‌ పూర్తి చేసే బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నాం : ప్రధాని మోదీ

-

2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యం పూర్తి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడారు. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం దేశం కోసం పోరాడుతోందని చెప్పారు. ఐదేళ్లు ప్రగతి కోసం పోరాడాలని, తర్వాత వచ్చే ఎన్నికల గురించి ఆలోచించాలని కూటమి నేతలకు మోదీ పిలుపునిచ్చారు.

‘అమృత్‌ కాలానికి చెందిన బడ్జెట్‌ ఇది. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ పూర్తి చేసే బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నాం. సవాళ్లను ఎదుర్కొంటు ముందుకెళ్తున్నాం. మా ప్రభుత్వం దేశం కోసం పోరాడుతుంది. 2029 జనవరిలో ఎన్నికల్లో పోరాడదాం. సభలో మాట్లాడేందుకు వివిధ పార్టీల నుంచి వచ్చిన సభ్యులకు అవకాశం వస్తుంది. ఐదేళ్లు ప్రగతి కోసం పోరాడాలి.. తర్వాత వచ్చే ఎన్నికల గురించి ఆలోచించాలి.’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మరోవైపు మరికాసేపట్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే సభ్యులంతా పార్లమెంటుకు చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version