తన ప్రసంగంతో G20 సదస్సును ప్రారంభించిన మోదీ

-

భారత్ తొలిసారిగా అతిథ్యమిస్తున్న జీ-20 శిఖరాగ్ర సదస్సు దిల్లీ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సదస్సు ప్రారంభించారు. తన ప్రసంగంతో మోదీ సదస్సును ప్రారంభించారు. ప్రారంభోపన్యాసంలో మోదీ మొరాకోలో సంభవించిన భూకంపంపై స్పందించారు.

మొరాకోలో భూకంపం సంభవించడం చాలా విరాచకరమని ప్రధాని మోదీ అన్నారు. భూకంపంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మొరాకోకు భారత్‌ అండగా ఉంటుందని ఆపన్న హస్తం అందించారు. అంతకుముందు జీ-20 సదస్సు జరిగే భారత్‌ మండపం వద్ద.. ప్రపంచ నేతలకు ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు. ఈ ప్రదేశంలో బ్యాక్​ గ్రౌండ్‌లో కోణార్క్‌ చక్రం స్పష్టంగా కనిపించింది. ఈ చక్రం కదలిక.. సమయం, పురోగతి, నిరంతర మార్పును సూచిస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ను సాదరంగా స్వాగతించిన ప్రధాని మోదీ.. వేదిక ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోణార్క్‌ గురించి బైడెన్‌కు వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version