దీపావళి ఎఫెక్ట్​.. దిల్లీలో మళ్లీ పెరిగిన వాయు కాలుష్యం

-

సాధారణంగానే దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువ. ఇక శీతాకాలం వచ్చిందంటే ఈ కాలుష్యం మరింత పెరుగుతుంది. ఇప్పటికే రోజురోజుకు కాలుష్య తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలో దీపావళి పండుగ వచ్చేసింది. టపాసులు పేల్చొద్దంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినా.. ఎవరూ ఖాతరు చేయలేదు. దీపావళి నేపథ్యంలో భారీగా బాణాసంచా కాల్చడంతో దిల్లీలో వాయు నాణ్యత మరింత దెబ్బతింది.

టపాసులు కాల్చడం వల్ల పొగ ఏర్పడి కొన్ని వందల మీటర్ల వరకు రహదారులు కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఆర్​కే పురం, ఆనంద్ విహార్​లలో 290, పంజాబీ బాగ్​లో 280, ఐటీఓలో 263గా ఏక్యూఐ (వాయు నాణ్యత సూచీ) రికార్డైనట్లు కేంద్ర కాలుష్య నియంత్ర బోర్డు తెలిపింది. ఆదివారం సాయంత్రానికి దిల్లీలో వాయు నాణ్యత మెరుగ్గానే ఉందని.. గడిచిన ఎనిమిదేళ్లతో పోలిస్తే ఈ సారి దీపావళి సమయంలో వాయు నాణ్యత మెరుగ్గా కనిపించిందని పేర్కొంది. నగరంలో వర్షం కురవడం, గాలి వేగం కారణంగా శనివారం కాలుష్యం తగ్గినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version