కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీతో పూనమ్ కౌర్ చేయి పట్టుకుని నడుస్తున్న ఫొటోపై ఈ వివాదం చెలరేగింది. తాత అడుగు జాడల్లో నడుస్తున్నాడని బీజేపీ నేత ప్రీతి ట్వీట్ చేశారు. అయితే… బీజేపీ పార్టీ నేత ప్రీతి ట్వీట్‌పై స్పందించారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఈ నేపథ్యంలోనే… మహిళలతో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్న ఫొటోలను ట్వీట్ చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.
ఇక ఈ వివాదంపై పూనమ్ కౌర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇది పూర్తిగా కించపరిచేలా ఉందని, తాను జారీ పడబోతుంటే రాహుల్ తన చేయి పట్టుకున్నారని క్లారిటీ ఇచ్చింది. ప్రధాని మోదీ నారీ శక్తి గురించి చెబుతుంటారని గుర్తుంచుకోండి అంటూ బిజెపి శ్రేణులకు పూనమ్ కౌర్ సూచించింది.
ప్రధాని మోదీ నారిశక్తి గురించి చెబుతున్నప్పుడు బిజెపి నేతలు ఇలా చేయడం అవమానకరమని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చింది. ఈ ఫోటోపై ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని, ఇలా చేయడం తగదని సూచించింది. ఇలాంటివి మానుకోవాలని ఇతరులను కించపరచడం కరెక్ట్ కాదని తెలిపింది. రాహుల్ గాంధీకి స్త్రీల పట్ల ఉన్న గౌరవం, శ్రద్ధ, రక్షణ స్వభావం తన హృదయాన్ని తాకిందని పూనమ్ కౌర్ ట్విట్టర్ లో పేర్కొంది.