Prime Minister Modi : ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ లోని అధంపూర్ ఎయిర్ బేస్ కు ప్రధాని మోడీ తీసుకున్నారు. ఫైటర్ జెట్ పైలట్స్ ను కలిసారు మోడీ. ఆపరేషన్ సిందూర్ లో పాల్గొన్న జవాన్లతో ప్రధాని ముచ్చటించనున్నారు. పాకిస్థాన్ పై దాడుల్లో కీలక పాత్ర పోషించింది అధంపూర్.

సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు అధంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లిన ప్రధాని మోడీ… ఫైటర్ జెట్ పైలట్స్ ను కలిసారు. ఇది ఇలా ఉండగా పాక్ దాడుల నేపథ్యంలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. పాక్ దాడుల్లో దాదాపు 10 మంది జవాన్లు 40కి పైగా సామాన్యులు మృతి చెందారు. పహల్గాం దాడిలో 26 మంది చనిపోయిన తరువాత పాకిస్తాన్ చేసిన దాడుల్లో పూంచ్ సెక్టార్లో 16 మంది సామాన్యులు చనిపోగా మరో 10 మంది జవాన్లు వీర మరణం పొందారు.