దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం ఎన్నికల ప్రచారానికి ముగింపు కావడంతో పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో లోక్‌సభ ఎన్నికలు-2024 కోసం ప్రధాని తన చివరి ర్యాలీని నిర్వహించారు. సిక్కులపై కీలక ప్రకటన చేసిన మోడీ, అయోధ్యలో రామ జన్మస్థలం కోసం సిక్కులు మొదటి యుద్ధం చేశారన్నారు. మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని దేశ ప్రజలు నిర్ణయించుకున్నారని ప్రధాని మోడీ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి మోడీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టబోతోందని స్పష్టం చేశారు.
పంజాబ్ మన భారతదేశానికి గుర్తింపు అని, ఇది మన గురువుల పుణ్యభూమి అని అన్నారు. అంతేకాదు అయోధ్యలో రామ జన్మభూమి కోసం తొలి యుద్ధం చేసింది సిక్కులే అని అన్నారు. నేడు దేశంలో ఆకాంక్షలు కొత్తవి, అంచనాలు కొత్తవి, విశ్వాసం కొత్తవి అని ప్రధాని అన్నారు. దశాబ్దాల తరవాత అలాంటి సమయం రాగానే సంపూర్ణ మెజారిటీతో కేంద్ర ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టబోతోందన్నారు. ప్రతి భారతీయుడి ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ అనే కల త్వరలోనే నేరబోతుందన్నారు అందుకే ప్రతి దేశస్థుడు మనల్ని ఆశీర్వదిస్తున్నారన్నారని గుర్తు చేశారు.ఈ ఎన్నికల్లో ప్రధాని దాదాపు 200కి పైగా ప్రచార సభల్లో పాల్గొన్నారు.