లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. ప్రియాంకా గాంధీ సన్నిహితుడు, కాంగ్రెస్ సీనియర్ నేత తజిందర్ సింగ్ పార్టీని వీడారు. పార్టీ పదవులతోపాటు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖ పంపారు. అనంతరం దిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో తజీందర్ సింగ్ బీజేపీలో చేరారు.
మూడున్నర దశాబ్దాలు కాంగ్రెస్ కోసం పని చేశాను. నేను ఎవరినీ విమర్శించాలనుకోవడం లేదు. కేవలం పంజాబ్ అభివృద్ధి కోసమే కమలం పార్టీలో చేరాను. భారత జాతీయ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి, హిమాచల్ ప్రదేశ్‌లోని ఏఐసీసీ కో-ఇన్‌చార్జ్ సెక్రటరీ పదవికి తక్షణమే రాజీనామా చేశాను. అని లేఖలో తజిందర్ సింగ్ తెలిపారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తాజిందర్ సింగ్ కీలక పదవికి గుడ్ బై చెప్పడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.