పూణే రేప్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో తాజాగా… కండోమ్స్ అంశం తెరపైకి వచ్చింది. నిందితుడు రాందాస్… యువతిపై లైంగిక దాడి చేసిన బస్సులో… వందల సంఖ్యలో కండోమ్ లు… మహిళల లోదుస్తులను పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు.
దీంతో ఆ మానవ మృగం… ఇంకా ఎంతమందిపై లైంగిక దాడి చేసిందో అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన లో బస్సు ఉన్న స్థానానికి అలాగే పోలీస్ స్టేషన్ కు వంద మీటర్లు మాత్రమే దూరం ఉంటుంది. అయితే నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. డ్రోన్లు అలాగే సిసి కెమెరాలు ఆధారంగా… నిందితుడిని పట్టుకునేందుకు… చర్యలు తీసుకుంటున్నారు.