పార్లమెంట్ కొత్త భవనంలో ఇవాళ లోక్ సభ, రాజ్యసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ లోక్ సభలో తొలి ప్రసంగం చేశారు. అనంతరం న్యాయ శాఖ మంత్రి లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. ఆ తరువాత లోక్ సభ వాయిదా వేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు 2010లో ఆమోదం పొందింది. మహిళా రిజర్వేషన్ బిల్లును సమర్థవంతంగా అమలు చేయాలి. బడుగు, బలహీన వర్గాల మహిళలను బీజేపీ రాజకీయం కోసం వేడుకుంటుంది. ఈ మహిళా బిల్లులో ఓబీసీ, ఎస్సీ రిజర్వేషన్లను చేర్చాలి. బలహీన వర్గాల వారికి టికెట్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ పాలనలో దేశంలో ఫెడరల్ వ్యవస్థ బలపడుతోంది అన్నారు ఖర్గే. మూడో వంతు వెనుకబడిన వర్గాల వారికి ఇవ్వాలని ఖర్గే పట్టుబట్టారు. వెనుకబడిన కులాల మహిళలకు పెద్దగా చదువు ఉండదని రాజ్యసభలో గుర్తు చేశారు మల్లి కార్జున ఖర్గే. మరోవైపు బలహీన వర్గాల వారికి టికెట్లు కేటాయిస్తున్నారని.. మహిళా నేతలపై ఖర్గే వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ స్పందించారు.