రెండో రోజు కొనసాగుతున్న భారత్‌ జోడో న్యాయ్ యాత్ర

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపుర్‌లో రెండో రోజు భారత్‌ జోడో న్యాయ్ యాత్రను కొనసాగిస్తున్నారు. ఇంఫాల్ పశ్చిమ ప్రాంతంలోని క్యాంప్‌ సైట్‌లో ఇవాళ ఉదయం ఏడున్నరకు కాంగ్రెస్ నేతలు జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం యాత్రను కొనసాగించారు. రాహుల్‌ యాత్ర మణిపుర్లోని సెక్మై, కాంగ్ పోక్సి, సెనాపతిగా మీదుగా సాగింది. ఈరోజు రాత్రికి నాగాలాండ్‌ చేరుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారు. రాత్రికి నాగాలాండ్‌లోనే రాహుల్ బస చేయనున్నట్లు చెప్పారు.

మరోవైపు రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్రపై పలువురు కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. న్యాయం కోసం నినాదం ఉద్ధృతమైంది అంటూ కాంగ్రెస్ సామాజిక మాధ్యమ ప్రతినిధి సు‌ప్రియ శ్రీనటె పోస్టు పెట్టారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికం, నేరాలు, అభద్రత వంటి అన్యాయాలపై కలిసి పరిష్కారాలు అన్వేషిద్దామని తన పోస్టులో పేర్కొన్నారు.

మరోవైపు ఆదివారం రోజున మణిపుర్లో భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభించిన రాహుల్ గాంధీ మాట్లాడుతూ మణిపుర్ బాధను తాను అర్థం చేసుకున్నానని అన్నారు. త్వరలోనే ఆ రాష్ట్రంలో శాంతి నెలకొల్పుతానని ప్రజలకు హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version