మోదీ హిందూస్థాన్‌ను హత్య చేశారు.. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు ఫైర్

-

లోక్​సభలో కేంద్రంపై విపక్ష కూటమి ఇండియా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ రెండోరోజు కొనసాగుతోంది. ఇవాళ మొదలైన ఈ చర్చలో కాంగ్రెస్ సభ్యుడు రాహుల్ గాంధీ అవిశ్వాస తీర్మానంపై ప్రసంగిస్తున్నారు. తాను కొన్ని రోజుల క్రితం మణిపుర్ వెళ్లానని అక్కడి ప్రజల బాధను చూసి చలించిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఇప్పటి వరకు మణిపుర్​ ఎందుకు వెళ్లలేదని నిలదీశారు.

ప్రధాని మోదీ మణిపుర్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. మణిపుర్ ప్రజల భరోసాను చంపేశారు. మోదీకి రాజనీతి లేదు. ప్రధాని నరేంద్ర మోదీ మణిపుర్​ను చంపేశారు. భారత్​ను హత్య చేశారు. అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై లోక్​సభలో గందరగోళం నెలకొంది. రాహుల్‌ గాంధీ ప్రసంగంపై బీజేపీ సభ్యులు అభ్యంతరం చెప్పారు. రాహుల్‌ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

కొన్నిరోజుల క్రితం నేను మణిపుర్‌ వెళ్లాను. ప్రధాని మోదీ ఇప్పటి వరకు మణిపుర్‌ వెళ్లలేదు. ప్రధాని మోదీ దృష్టిలో మణిపుర్‌ దేశంలో భాగం కాదు. మణిపుర్‌ పునరావాస శిబిరాల్లోని మహిళలు, పిల్లలతో నేను మాట్లాడాను. మణిపుర్‌ బాధితులకు మద్దతుగా నేను రాత్రంతా వారితో గడిపాను. ప్రధాని మోదీ మణిపుర్‌ను రెండు వర్గాలుగా విడగొట్టారు. నేను అబద్దాలు చెప్పడం లేదు.. మీరే అబద్దాలు చెబుతారు.’ అంటూ రాహుల్ ప్రసంగం కొనసాగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version