ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. అయితే ప్రధాని కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం గహ్లోత్ ప్రసంగాన్ని రద్దు చేశారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన గహ్లోత్.. మోదీకి ట్విటర్ వేదికగా కౌంటర్ వేశారు.
‘‘ఈ రోజు మీరు రాజస్థాన్‌కు వస్తున్నారు. కానీ, ప్రధాని కార్యాలయం నా మూడు నిమిషాల ప్రసంగాన్ని షెడ్యూల్ నుంచి తొలగించింది. అందువల్ల, నేను నా ప్రసంగంతో మిమ్మల్ని ఆహ్వానించలేకపోతున్నా. అందుకే, ట్విటర్ వేదికగా మీకు సాదర స్వాగతం పలుకుతున్నా. నేను నా ప్రసంగంలో చెప్పాలనుకున్న డిమాండ్లను కూడా ట్విటర్ ద్వారానే మీ ముందుంచుతున్నా. ఆరు నెలల్లో ఏడోసారి రాష్ట్రానికి వస్తున్న మీరు.. ఈ సారైనా మా డిమాండ్లను నెరవేరుస్తారని ఆశిస్తున్నా’’ అని గహ్లోత్ కౌంటర్ వేశారు.
రాజస్థాన్‌లోని సీకర్ పట్టణంలో ప్రధాని మోదీ గురువారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు/ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 1.25లక్షల పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని ఆయన జాతికి అంకితం చేయనున్నారు. పర్యటనలో భాగంగా సీకర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.