ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు.. పాకిస్తాన్ దాడి చేస్తే తీవ్రమైన ప్రతిదాడి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.ఆపరేషన్ సిందూర్‌లో దాదపు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా… కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు మొత్తం 100 మంది చనిపోయినట్లు వివరించారు రాజ్ నాథ్ సింగ్. పాకిస్తాన్ చర్యలకు కచ్చితంగా…. ఎదురు దాడి చేస్తామని వివరించారు. తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు బార్డర్ లో జరుగుతున్న విషయాలను తెలుసుకుంటూ ఉందని చెప్పుకొచ్చారు.