గుడ్ న్యూస్ : త‌గ్గిన వంట నూనెల ధ‌ర‌లు

-

సామాన్యులకు శుభ‌వార్త‌. వంట నూనెల ధ‌ర‌లు త‌గ్గాయి. దేశంలో ప‌లు ప్ర‌ధాన వంట నూనెల కంపెనీలు త‌మ నూనె ఉత్ప‌త్తుల‌పై ధ‌ర‌ల‌ను త‌గ్గించాయి. మంచి నూనె కంపెనీలు ఎమ్ఆర్‌పీ పై దాదాపు 10 నుంచి 15 శాతం మేర ధ‌ర‌ల‌ను త‌గ్గించాయి. దీంతో సామాన్య ప్ర‌జ‌ల‌కు నిత్య‌వ‌స‌ర ధ‌ర‌ల విష‌యంలో కాస్త ఊర‌టను ఇస్తుంది. మంచి నూనెల ధ‌ర‌ల‌ను ఎమ్ఆర్‌పీ పై 10 నుంచి 15 శాతం త‌గ్గిస్తున్నట్టు సాల్వెంట్ ఎక్స్ ట్రాక్ట‌ర్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) ప్ర‌కటించింది.

అయితే త‌గ్గించి బ్రాండ్ లీస్ట్ లో అదానీ విల్ మార్ కు చెందిన ఫార్చ్యూన్ బ్రాండ్ ఉన్నాయి. అలాగే రుచి సోయ కు చెందిన మ‌హాకోష్, స‌న్ రిచ్, రిచ్ గోల్డ్, న్యూట్రెల్లా బ్రండ్స్ త‌గ్గించాయి. అలాగే ఇమామికి చెందిన హెల్తీ అండ్ టెస్టీ బ్రాండ్స్. బంగే కు చెందిన డాల్టా, గ‌గ‌న్, ఛంబ‌ల్ బ్రాండ్స్ ఉన్నాయి. జెమినికి కంపెనీకి చెందిన ఫ్రీడ‌మ్ స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్ బ్రాండ్స్ ఉన్నాయి. ఫ్రిగోరిఫికో అల్లానా కు చెందిన స‌న్నీ బ్రాండ్ ఉన్నాయి. గోకుల్ అగ్రో కు చెందిన నిటాలైఫ్, మ‌హేక్, జైకా బ్రాండ్ లు ఉన్నాయి. ఈ కంపెనీల ధ‌ర‌లు 10 నుంచి 15 శాతం మేర త‌గ్గ‌నున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version