ఐదు గ్యారెంటీలపై కర్నాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు

-

కర్నాటక ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీలపై సొంత పార్టీ మంత్రినే సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక లో 5 గ్యారెంటీలు, తెలంగాణ ఎన్నికల్లో  కూడా 6 గ్యారెంటీల హామీ ఇచ్చి కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఐదు గ్యారెంటీల పై కర్ణాటక మంత్రి సతీష్ జర్కీహోళీ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఐదు గ్యారెంటీలు అందరికీ కాకుండా కేవలం అర్హులకు మాత్రమే అందజేయాలని.. ఈ హామీలను ప్రభుత్వం మరోసారి సమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

కొంతమంది ధనికులు కూడా ఈ పథకాలను పొందుతున్నారని.. అలాంటి వారిని గ్యారెంటీల నుంచి మినహాయిస్తే రాష్ట్రానికి ప్రతీ సంవత్సరానికి రూ.10వేల కోట్ల వరకు ఆదా అవుతాయని పేర్కొన్నారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలను విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారీతిన హామీలు ఇచ్చి.. ఇప్పుడు బారం మోయలేకపోతుందని ఎద్దేవా చేసాయి. ప్రభుత్వ సొమ్మును అనర్హులకు కూడా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version