భారత్ ఓటమి తర్వాత షమీ మాజీ భార్య వీడియో.. అభిమానులు ఫైర్ !

-

వన్డే వరల్డ్ కప్ మరోసారి టీమిండియా చేజారింది. స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ లో టీమిండియానే ట్రోఫీ ముద్దాడుతుందని అంత అనుకున్నారు. కానీ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ లో భారత్ తడబడింది. బ్యాటింగ్ విభాగం తడబాటుతో బౌలర్లపై ఒత్తిడి పెరిగింది. చివరకు కంగారుల చేతిలో ఓడి వరల్డ్ కప్ చేజార్చుకుంది.

Shami’s ex-wife’s video after India’s defeat

ఇది ఇలా ఉండగా..భారత జట్టు స్టార్ ప్లేయర్ మహ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహన్ మరోసారి వివాదంలో నిలిచారు. WCలో భారత ఓటమి అనంతరం వీడియో షేర్ చేసిన ఆమె….’చివరికి విజయం వరించేది మంచి మనసున్నోళ్లకే’ అని రీల్ చేశారు. షమీ, భారత జట్టు ఓటమిని ఉద్దేశించే ఆమె ఈ వీడియో పోస్ట్ చేశారని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. దీంతో ఒక వ్యక్తిపై కోపాన్ని దేశం మీద ద్వేషంగా మార్చడం సరికాదని భారత అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version