గుజరాత్‌లో భయంకర చాందీపుర వైరస్‌.. ఆరుగురు చిన్నారులు మృతి..!

-

గుజరాత్‌లో అనుమానాస్పద వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. చాందీపుర అనే వైరస్ సోకి జులై 10 నుంచి ఇప్పటివరకు ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 12కు చేరిందని ఆరోగ్య శాఖ మంత్రి రిషికేశ్‌ పటేల్ తెలిపారు. బాధితులు సబర్‌కాంతా, ఆరావళి, మహిసాగర్, ఖేడా జిల్లాలకు చెందినవారని పేర్కొన్నారు. వారిలో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్ వారు కూడా ఉన్నారని, అందరికీ గుజరాత్‌లోనే చికిత్స అందుతోందని చెప్పారు.

‘‘అనుమానిత చాందీపుర వైరస్‌ వల్లే ఆరు మరణాలు సంభవించాయని ప్రాథమికంగా తెలుస్తోంది. పూర్తిస్థాయి ధ్రువీకరణ నిమిత్తం నమూనాలను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌Æ వైరాలజీకి పంపాం’’ అని మంత్రి వెల్లడించారు.

చాందీపుర వైరస్‌ అంటే ఏంటీ..?

ఈ వైరస్‌ సోకిన వ్యక్తిలో జ్వరం, ఫ్లూ, మెదడువాపు వంటి లక్షణాలు కనిపిస్తాయని మంత్రి తెలిపారు. దోమలు, ఇతర కీటకాల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుందని వెల్లడించారు. ఈ వైరస్ అంటువ్యాధి కాదని.. ఈ వైరస్‌ను అదుపులో ఉంచేందుకు ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్ట చర్యలు చేపడుతున్నామని.. ఇప్పటివరకు 18,646 మందిని పరీక్షించామని మంత్రి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version