‘మోదీతో మా నాన్న.. కంగారేస్తోంది’.. కేంద్రమంత్రి పోస్టు వైరల్‌

-

చిన్నప్పుడు స్కూల్​కు మన పేరెంట్స్ వచ్చినప్పుడు ప్రిన్సిపాల్​ వారితో ఏం చెబుతారోనని తెగ కంగారు పడే వాళ్లం కదూ. ఆ సమయంలో మన మెదడులో ఎన్ని ఆలోచనలు తిరుగుతాయో మాటల్లో వర్ణించడం కష్టమే. ఇప్పుడు అదే అనుభూతిని పొందారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. అదేంటి ఆమె కూడా స్కూల్​కు వెళ్లారా అనుకుంటున్నారా. అదేం లేదు.. కానీ ప్రిన్సిపాల్ లాంటి తన బాస్​, తన తండ్రి ఒక దగ్గర చేరేసరికి స్మృతి ఇరానీ కూడా ఇలాంటి అనుభూతినే పొందారట. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇంతకీ ఆ పోస్టులో ఏం ఉందంటే..?

కేంద్రమంత్రి స్మృతి తండ్రి అజయ్‌ కుమార్‌ మల్హోత్రా ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. వీరి భేటీని పేరెంట్‌-టీచర్ మీటింగ్​తో పోలుస్తూ స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘మన బాస్‌, మన తల్లిదండ్రులు ఒక దగ్గర కూర్చున్నారంటే కంగారొచ్చేస్తుంది. వారిద్దరూ కలిసి మనపై పోటీ పడి ఫిర్యాదులు చెప్పకూడదని ప్రార్థించుకోవాలి. పేరెంట్స్-టీచర్‌ మీటింగ్ జరుగుతోంది’ అని ఇరానీ ఈ పోస్టు కింద క్యాప్షన్​లో రాసుకొచ్చారు. అంతే కాకుండా బిజీ షెడ్యూల్‌లో కూడా తమకు సమయం కేటాయించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version