BREAKING : పట్టాలు తప్పిన సుహైల్‌దేవ్ సూపర్​ఫాస్ట్​ ఎక్స్​ప్రెస్

-

ఇటీవల రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒడిశా రైలు ప్రమాదం మిగిల్చిన విషాదం మరవకముందే విజయనగరంలో రెండు రైళ్లు ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది. ఇది జరిగిన రెండ్రోజులకే ఇప్పుడు మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​ రైల్వే స్టేషన్​ సమీపంలో సుహైల్‌దేవ్​ సూపర్​ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ హాని జరగలేదు. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఘాజీపుర్​ నుంచి దిల్లీలోని ఆనంద్​ విహార్ టెర్మినల్​​కు వెళ్తున్న సుహైల్‌దేవ్​ సూపర్​ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్​ సహా మరో రెండు కోచ్​లు పట్టాలు తప్పాయి.

ఈ ఘటన గురించి విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణలపై ఆరా తీశారు. రైల్వే ట్రాక్​ పునరుద్ధరణ పనులు చేపట్టడంతో.. మిగతా రైళ్ల రాకపోకలు​ సాధారణంగానే జరుగుతున్నాయని ఉత్తర మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు. గ్రీన్ సిగ్నల్​ ఇచ్చిన వెంటనే రైలు ప్రయాగ్​రాజ్​ స్టేషన్​ నుంచి బయలుదేరిందని.. ఆ సమయంలోనే ప్లాట్​పామ్​ నెంబర్​ 6 వద్ద ఈ ఘటన జరిగిందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version