కేరళ బాధితుల కోసం రూ.15 కోట్లు ప్రకటించిన సుకేష్ చంద్రశేఖర్ ?

-

కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కుడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ చూసిన వర్షాలే. ఈ నేపథ్యంలోనే వరదలు కూడా విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా వయనాడు జిల్లాలో అయితే పరిస్థితి చేతులు దాటిపోయింది. కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు 350 కి పైగా జనాలు మరణించారు. ఇంకా కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. శవాలు.. కుప్పలు కుప్పలుగా జమావుతున్నాయి.

Sukesh chandrasekhar issues a letter of Intent to Kerala Chief Minister to accept contribution of 15 Crores towards relief fund

అయితే ఇలాంటి నేపథ్యంలోనే… బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు అలాగే తమిళనాడు ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు ముందుకు వస్తున్నారు. ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నారు. అయితే తాజాగా… జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ కూడా కీలక ప్రకటన చేశారు. కేరళ బాధితులకు సహాయనిధి కింద 15 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు సుఖేష్ చంద్రశేఖర్. ఈ డబ్బులను తీసుకోవాలని కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ని కోరారు సుకేష్ చంద్రశేఖర్. మరి దీనిపై కేరళ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాగా అల్లు అర్జున్ 25 లక్షలు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version