‘స్త్రీ, పురుషులకు ఒకే వివాహ వయస్సు’.. పిటిషన్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

-

పురుషులు, మహిళలు ఇద్దరికీ ఒకే విధమైన కనీస వివాహ వయసు ఉండాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. దీనిపై చట్టం చేసేందుకు పార్లమెంటుకు అత్యున్నత న్యాయస్థానం మాండమస్ జారీ చేయదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కోర్టులు మాత్రమే రాజ్యాంగ పరిరక్షులు కాదని.. పార్లమెంటుపైనా ఆ బాధ్యత ఉందని గుర్తు చేసింది. ఈ అంశంపై కోర్టులు చట్టం చేయలేవని వివరిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది.

“స్త్రీ పురుషుల వివాహ వయసుల మధ్య వ్యత్యాసం.. లింగ సమానత్వ సూత్రాన్ని ఉల్లంఘిస్తుంది. ఇది మహిళ వివక్షకు దారితీస్తుంది. భారత్​లో 21 ఏళ్ల వయసున్న పురుషుడు..18 ఏళ్లకు మహిళ వయసున్న మహిళ పెళ్లి చేసుకోవచ్చు. ఈ వ్యత్యాసం పితృస్వామ్య మూస పద్ధతులపై ఆధారపడి ఉంది. న్యాయపరమైన అసమానతలకు దారితీస్తుంది. ఇది మహిళలకు, ప్రపంచ పోకడలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది” అని పిటిషనర్​ వాదించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఇది పార్లమెంటుకు రిజర్వ్ చేయదగిన అంశమని పిటిషన్​ను కొట్టివేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version