తప్పుదోవ పట్టించే యాడ్స్ కేసులో.. రామ్‌దేవ్‌బాబాకు సుప్రీంకోర్టు సమన్లు

-

తప్పుదారి పట్టించే ప్రకటన కేసులో వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరు కావాలని యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. పతంజలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆచార్య బాలకృష్ణ కూడా తమ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. తప్పుదారి పట్టించే ప్రకటన కేసులో ధిక్కార పిటిషన్‌పై సమాధానం ఇవ్వకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే రామ్‌దేవ్‌ బాబా, ఆచార్య బాలకృష్ణకు సమన్లు జారీ చేసింది. వ్యాక్సినేషన్ డ్రైవ్, ఆధునిక ఔషధాలకు వ్యతిరేకంగా రామ్‌ దేవ్ చేసిన వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించిన విషయం తెలిసిందే. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో చెప్పాలని జస్టిస్‌ హిమా కోహ్లీ జస్టిస్‌ అమానుల్లాతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. జబ్బులను నయం చేస్తాయంటూ పతంజలి ఆయుర్వేద మందులపై చేసిన ప్రచారం వల్ల దేశం మొత్తం మోసపోయిందని, ఇక ఆ ప్రచారాన్ని ఆపాలని, ఉత్పత్తుల బ్రాండింగ్‌ను నిలిపేయాలని రామ్ దేవ్ బాబా సంస్థను గత విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version