తెహ్రీక్‌ ఏ హురియత్‌పై కేంద్రం నిషేధం వేటు

-

జమ్మూ కశ్మీర్‌లో పాక్‌ అనుకూల వేర్పాటు వాద సంస్థ తెహ్రీక్‌ ఏ హురియత్‌ (టీఈహెచ్‌)పై కేంద్రం వేటు వేసింది. ఈ సంస్థపై తాజాగా హోం మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడం, భారత వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.

ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించని వైఖరికి కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. ఏ వ్యక్తి అయినా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తాము అడ్డుకొంటామని హెచ్చరించారు. తెహ్రీక్‌ ఏ హురియత్‌ను చట్ట విరుద్ధ సంస్థగా ప్రకటిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. ఉపా చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. భారత్‌ నుంచి జమ్మూ కశ్మీర్‌ను వేరు చేసి అక్కడ ఇస్లామిక్‌ పాలన ఏర్పాటు చేయడానికి ఈ సంస్థ పలు ప్రయత్నలు చేసిందని అమిత్ షా సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ (ట్విటర్) వేదికగా పోస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version