ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ దారుణ హత్య

-

ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ దారుణ హత్య చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలోని బక్లీలో ఈ ఘటన జరిగింది. రోడ్డు సమీపంలో ఉన్న ఓ చెత్త డబ్బాలో చైతన్య మాధగాని, అలియాస్ శ్వేత మృతదేహం కలకలం రేపింది.

ఈ తరుణంలోనే… కేసు దర్యాప్తు చేస్తున్నారు స్థానిక విక్టోరియా పోలీసులు. మహిళను హత్య చేసి నిందితుడు విదేశాలకు పారిపోయినట్లు విక్టోరియా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా మిర్కావే, పాయింట్ కుక్‌లోని చిరునామాలో ఉంటోంది ఆ మహిళ. ఇక మృతురాలు శ్వేత భర్త అశోక్ రాజ్ వరికుప్పల ఇటీవలే హైదరాబాద్ కు వచ్చారు. ఈ తరుణంలోనే.. శ్వేత ను హత్య చేశారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version