BREAKING: రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్న టీడీపీ

-

త్వరలో రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల చేయనుంది టీడీపీ. పి.గన్నవరం, కైకలూరు, తాడేపల్లి గూడెం, పెందుర్తి, కాకినాడ అర్బన్, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, మదనపల్లె, కదిరి, కాళహస్తి వంటి స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనే అంశంపై తర్జన భర్జన పడుతోంది టీడీపీ పార్టీ. సోము వీర్రాజు కోసం రాజమండ్రి అర్బన్ పై టీడీపీ పునరాలోచన చేసే ఛాన్స్‌ ఉంది.

TDP to release list of second phase candidates

ఇప్పటికే రాజమండ్రి అర్బన్ స్థానాన్ని ఆదిరెడ్డి వాసుకు ఖరారు చేసింది టీడీపీ. పలు ఎంపీ స్థానాల పైనా స్పష్టత రావాల్సి ఉందంటోన్నాయి కూటమి పార్టీలు జనసేన, బీజేపీ, టీడీపీ. రేపు లేదా ఎల్లుండి చంద్రబాబు, పవన్ ను విడివిడిగా భేటీ కానున్నారు బీజేపీ జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్. శివ ప్రకాష్ భేటీ తర్వాత రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదలపై రానున్న క్లారిటీ రానుంది. రెండో విడత జాబితాలో కొన్ని ఎంపీ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించనున్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version