ఓటీటీల విషయంలో కేంద్రం కొత్త నిబంధన!

-

మనం ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు సినిమా మొదట్లో వచ్చే యాడ్ మీకందరికీ గుర్తుండే ఉంటుంది. ” పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం. క్యాన్సర్ కి కారకం” అంటూ వచ్చే యాడ్ ని చూసే ఉంటారు. థియేటర్లలోనే కాకుండా టీవీలలోను ఇలాంటి యాడ్స్, హెచ్చరికలు కనిపిస్తుంటాయి. అయితే ఈ యాడ్స్ ఓటిటిలో మాత్రం కనిపించవు. అయితే ఇకనుండి ఓటిటి కంటెంట్ కి కూడా ఈ యాడ్స్ వర్తిస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

పొగాకు వ్యతిరేక ప్రకటనలు సినిమా ప్రారంభంలో ప్రసారం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకటనల ప్రసారాన్ని తప్పుని సరి చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏ భాషలో కంటెంట్ ఉందో అదే భాషలో పొగాకు కి వ్యతిరేక హెచ్చరికలు ఉండాలని సూచించింది. ఒకవేళ ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version