అప్పుల కు బదులుగా భార్యను అప్పగించిన ఉదంతం రాజస్థాన్ లోని చురు జిల్లాలో జరిగింది.తన భర్తే అప్పు ఇచ్చిన వారితో సంబంధాలు పెట్టుకోవాలని తనను బలవంతం చేశాడని..చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని వివాహిత ఆవేదన వ్యక్తం చేసింది.తన భర్త, అత్తమామల పై తీవ్ర ఆరోపణలు చేసిన ఆ మహిళ..బుధవారం సదర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.దీంతో వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు..2021 ఫిబ్రవరి లో చురులోని సదర్ కు చెందిన వ్యక్తితో మహిళకు వివాహమైంది.పెళ్లయిన తర్వాత వర కట్నం తీసుకురావాలని భర్త, అత్తమామలు వేధించేవారు.
భర్త మద్యానికి బానిసై…గ్రామంలోని ప్రజల వద్ద రూ.ఐదు లక్షలు అప్పు చేసాడు. అప్పులు చెల్లించాలంటూ డబ్బులు ఇచ్చినవారు అడగడం మొదలు పెట్టారు.దీంతో అప్పు ఇచ్చిన వారికి మహిళను అప్పగించారు కుటుంబ సభ్యులు.2022 ఫిబ్రవరి 27న అప్పు ఇచ్చిన వారు తనను వేధింపులకు గురి చేశారని భర్తకు చెప్పింది.వారికి సహకరించకపోవడం వల్ల ఆగ్రహించిన భర్త ఆమెను కొట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు.విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.