కర్ణాటక ఎన్నికల్లో ట్విస్ట్.. కాంగ్రెస్ కు వీరశైవ లింగాయత్ కమ్యూనిటీ మద్దతు

-

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇక ఈ కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మరో 3 రోజుల్లో జరగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్నీ రాజకీయ పార్టీలు ప్రచారంలో పాల్గొంటూ ఓటర్ మహాశయులను ప్రసన్నం చేసుకోవడానికి జోరుగా తిరుగుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మళ్లీ రావాలన్న ప్రయత్నాలలో మునిగి ఉంది.

ఇందుకోసం సినీ ప్రముఖులను సైతం ఇక్కడ తెలుగు ప్రజాలు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో వారితో ప్రచారం చేయిస్తున్నారు. తాజాగా ఈ ఎన్నికల ముందు బీజేపీ పార్టీ బిగ్‌ షాక్‌ తగిలింది. కర్నాటక లో బీజేపి కి షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది లింగాయత్ సామాజిక వర్గం.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి కి ఓటేయవద్దంటూ తమ సామాజిక వర్గానికి బహిరంగ లేఖ రాసింది కర్నాటక లింగాయత్& వీరశైవుల వేదిక. బీజేపి లింగాయత్ లను అవమానించిందంటూ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.యడ్యూరప్పను BJP అవమానించడం‌ మేమింకా మరచిపోలేదంటూ లేఖ విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపి కి వ్యతిరేకంగా పని చేయాలని పిలుపు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version