కోడలికి మళ్లీ పెళ్లి చేసాడు మామ. పెళ్లైన ఏడాదిన్నరకే తన కొడుకు చనిపోవడంతో, తండ్రిగా మారి కోడలికి మళ్లీ వివాహం జరిపించాడు మామ. గుజరాత్‌లోని అంబాజీ టౌన్‌కు చెందిన ప్రవీణ్ సింగ్ రాణా అనే వ్యక్తి కొడుకుకు ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది.

ఇటీవల అతని కొడుకు గుండెపోటుతో మరణించాడు. ఆరు నెలల పసిపాపతో విధవరాలుగా ఉన్న తన కోడలిని చూసి బాధతో, తన కొడుకు స్నేహితుడికి ఇచ్చి మళ్లీ వివాహం జరిపించాడు. కన్నీటితో తన కోడలిని అత్తగారింటికి సాగనంపడం చూసి, ప్రవీణ్ సింగ్ రాణాను స్థానికులు ప్రశంసించారు.