జమ్ము కశ్మీర్ ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తీరుతాం : ప్రధాని మోడీ

-

జమ్ము కశ్మీర్ ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తీరుతాం అని భారత ప్రధాని నరేంద్ర  మోడీ పేర్కొన్నారు. తాజాగా ఆయన జమ్ము కశ్మీర్ పలు అభివృద్ధి  పనులకు శ్రీకారం చుట్టారు. జమ్మూ ప్రజలకు ఆరోగ్య సౌకర్యాలు అందించేందుకు విజయపూర్ లో ఎయిమ్స్ ని ప్రారంభించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో స్థానికంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సత్కరించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు ప్రధాని నరేంద్ర మోడీ.

ముఖ్యంగా జమ్ము కశ్మీర్ లో రూ.32,000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ప్రధాని మోడీ.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మోడీ గ్యారెంటీ అంటే ఇలాగే ఉంటుంది. జమ్మూ నుంచి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. జమ్మూ అండ్ కశ్మీర్ ని అన్ని విధాలుగా అభివృదధి చేసి తీరతాం అని స్పష్టం చేశారు. కుటుంబ రాజకీయాలు చేసేవారు.. కేవలం వాళ్లకు లబ్ది కలిగేలా మాత్రమే చేశారు. త్వరలో వికసిత్ కశ్మీర్ కల సాకారం అవుతుంది అని తెలిపారు ప్రధాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version