Whats UP: వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్

-

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్లను అందిస్తూ వస్తుంది.. గతంలో ఎన్నో ఫీచర్లను అందించింది.. ఇప్పుడు తాజాగా మరి కొన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. వాట్సాప్ లో ‘నోట్స్’ పేరిట మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.

బిజినెస్ టూల్ గా పనిచేసే ఈ ఫీచర్ తో యూజర్లు తమ కస్టమర్లకు సంబంధించిన వివరాలను చాట్ ఇన్ఫో సెక్షన్ లో నోట్స్ గా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ గా ఉంటుంది. ఇతరులకు కనిపించదు. ఈ ఫీచర్ మొదట్లో సాధారణ యూజర్లకు అందుబాటులో ఉండదని, బిజినెస్ అకౌంట్స్ కి మాత్రమే అందుబాటులోకి వస్తుందని వాబీట ఇన్ఫో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version